వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడలో భక్తుల రద్దీ సమ్మక్క జాతర నేపథ్యంలో పెరిగిన భక్తులు భీమేశ్వర స్వామి. బద్ది పోచమ్మ ఆలయాలకు పోటెత్తిన భక్తులు కాకతీయ, వేములవాడ : సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, దర్శనాలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...