ధాన్యం ఇలా… వెళ్లేది ఎలా?
ధాన్యం ఇలా… వెళ్లేది ఎలా? ప్రమాదకర మూలమలుపులపై వరి ధాన్యం రాత్రివేళ వాహనదారులకు పెను ప్రమాదం ధాన్యం చుట్టూ రాళ్లు… భయాందోళనలో ప్రయాణికులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కాకతీయ, ఆత్మకూరు : ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగేలా రైతులు రహదారి మూల మలుపులపై వరి ధాన్యం పోసి ఆరబెడుతుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లే సమయంలో ఇది ప్రాణాపాయంగా మారుతోందని వారు చెబుతున్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని...