ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ
ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ డీసీపీ (లా & ఆర్డర్) ప్రసాద్ రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ తీరును, పోలీసుల పనితీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, డయల్–100 కాల్స్‌కు స్పందించిన సమయాలు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, సస్పెక్ట్ షీట్‌లు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల అప్లోడ్ స్థితిని పరిశీలించారు. జనరల్ డైరీ, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలను తనిఖీ చేసి,...