నల్లబెల్లిలో కొలువు తీరిన నూతన సర్పంచులు
నల్లబెల్లిలో కొలువు తీరిన నూతన సర్పంచులు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. గ్రామాభివృద్ధిపై ఆశలతో ప్రజలు ఎదురుచూస్తున్న వేళ, బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అనేక సమస్యలు నూతన పాలకవర్గాన్ని వెంటాడుతున్నాయి. త్రాగునీటి కొరత, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీల అస్తవ్యస్థత, కోతుల బెడద, వీధి కుక్కల సమస్యలు గ్రామాల్లో ప్రధాన సమస్యలుగా మారాయి. అంతేకాకుండా గత రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ...