విజేత విక్రమ్ ప్రమాణ స్వీకారం
విజేత విక్రమ్ ప్రమాణ స్వీకారం కాకతీయ, చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ విక్రమ్ సర్పంచ్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ప్రత్యేక అధికారుల నుంచి పాలకవర్గ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాన్ని...