ఎస్సీ సర్పంచులకు ఘన సన్మానం

ఎస్సీ సర్పంచులకు ఘన సన్మానం కాకతీయ, తొర్రూరు : అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాము ఈ రోజు సర్పంచులుగా నిలబడ్డామని నూతనంగా ఎన్నికైన ఎస్సీ, ఎస్సీ ఉపకులాల సర్పంచులు పేర్కొన్నారు. తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులకు ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ మంద యాకములు మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చలి వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విశ్రాంతి భవనంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంగారు రమేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం...