ప్రమాదాలను నివారించాలి
ప్రమాదాలను నివారించాలి బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో గతంలో గుర్తించిన ప్రమాద ప్రాంతాలు, అక్కడ చేపట్టిన నివారణ చర్యలను సమీక్షించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రణ చర్యలు అమలు...