విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం

విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం కాకతీయ, నర్సంపేట: ఆహారాన్ని వృథా చేయకుండా ప్రతి మెతుకును గౌరవించాలని డఫోడిల్స్ పాఠశాల చెర్మన్ చింతల నరేందర్ అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే దేశం లేదని పేర్కొన్నారు. ఎండ, వాన, చలి అన్నీ తట్టుకుంటూ రైతులు చేసే కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. మనం తినే ప్రతి మెతుకు రైతుల...