సమిష్టి కృషితోనే సింగరేణి అభివృద్ధి
సమిష్టి కృషితోనే సింగరేణి అభివృద్ధి కార్మికుల భద్రత, సంక్షేమమే ప్రాధాన్యం సింగరేణి డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి అభివృద్ధి ఒక్క నిర్ణయం వల్ల కాకుండా తరతరాల సమిష్టి కృషి, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతోనే సాధ్యమైందని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయ ఆవరణలో కార్పొరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, వారి...