ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి

ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి కాకతీయ, తొర్రూరు : ఎన్నికల విధులు, కుల గణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం టీపిటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్‌టీయూ సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి, ఏకగ్రీవం అయిన చోట్లతో పాటు రిజర్వ్ సిబ్బందికీ రెమ్యూనరేషన్ చెల్లించేలా ఎంపీడీవోలను ఆదేశిస్తామని కలెక్టర్ తెలిపారు....