బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్‌పీ భారీ నిరసన కాకతీయ, నేషనల్ డెస్క్ : ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం (హైకమిషన్) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు భారీ సంఖ్యలో హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఉదయం నుంచి హైకమిషన్ పరిసర ప్రాంతాల్లో వీహెచ్‌పీ కార్యకర్తలు గుమికూడారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, అక్కడి...