పిన్నవారి వీధి రోడ్డుకు వార్షికోత్సవం

పిన్నవారి వీధి రోడ్డుకు వార్షికోత్సవం కాలనీవాసుల సంబరాలు – కార్పొరేటర్‌కు సన్మానం కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో నిర్మించిన రోడ్డు పూర్తిై ఒక సంవత్సరం కావడంతో బుధవారం 28వ డివిజన్ కాలనీవాసులు, వ్యాపారస్తులు ఆనందోత్సాహాలతో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్‌తో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. నాణ్యమైన రోడ్డును నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించినందుకు కార్పొరేటర్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు వేసినప్పటి నుంచి వర్షకాలంలో కూడా...