భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అవగాహన పొందే ఉద్దేశంతో ఈ తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతల...