మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ

మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ కాకతీయ, ఖిలా వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ తన సొంత ఖర్చులతో మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. బుధవారం తూర్పు కోట పోచమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్‌లో పనిచేస్తున్న 40 మంది మున్సిపల్ కార్మికులకు ఈ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సువర్ణ సురేష్ మాట్లాడుతూ… కాలనీల పరిశుభ్రత కోసం ప్రతిరోజూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు...