యూరియా కోసం రైతుల పడిగాపులు

యూరియా కోసం రైతుల పడిగాపులు కాకతీయ, గీసుగొండ : యాసంగి పంట కీలక దశలో ఉండగా యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వానాకాలంలో ఎదురైన సమస్యే యాసంగిలోనూ కొనసాగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో బుధవారం యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో రైతులు చలిని లెక్కచేయకుండా తెల్లవారుజాము మూడు గంటల నుంచే అక్కడికి చేరుకుని బారులు తీరారు. రైతు కార్డులు ఉన్నప్పటికీ ఎన్ని ఎకరాల సాగు ఉన్నా ఒక్క కార్డుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వడంపై...