కొండ‌గ‌ట్టు ఆలయ భూముల జోలికి వస్తే ఊరుకోం

కొండ‌గ‌ట్టు ఆలయ భూముల జోలికి వస్తే ఊరుకోం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరిక కాకతీయ, కొండగట్టు :కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గుట్టపై అటవీ శాఖ అధికారులు హద్దులు నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీతారామ చంద్రస్వామి ఆలయం, బేతాళ స్వామి ఆలయాలను పరిశీలించిన...