ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి స్పందన

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి స్పందన కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని అనుబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, కొల్లి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బసవతారక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ వారి సహకారంతో డిసెంబర్ 23, 24 తేదీల్లో ఈ శిబిరం నిర్వహించారు. పాల్వంచ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని 8 మండలాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం...