బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత
బోడమంచ్యా తండాలో ఉద్రిక్తత వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇళ్లపై దాడులు ఇద్దరు పోలీసులకు గాయాలు… భారీ బలగాల మోహరింపు కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అనుమానితుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. వీరన్న హత్యకు కారకులుగా అనుమానిస్తున్న తండాకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు భరత్, బాలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. భరత్‌కు చెందిన ద్విచక్ర వాహనం, కిరాణా షాప్‌ను...