ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల ఐక్యత

ఇరవై ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల ఐక్యత మున్సిపల్ ఎన్నికల్లో శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా కొనసాగుతున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. పరస్పర విభేదాలకు ముగింపు పలుకుతూ, కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) కూటమిగా పోటీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఇరువురు నేతలు కలిసి నిర్వహించిన...