ఆడపడుచుల ఆత్మీయ బంధానికి వేదిక

ఆడపడుచుల ఆత్మీయ బంధానికి వేదిక చిన్ననాగారంలో వినూత్న కుటుంబ సమ్మేళనం మేనత్త–మేనకోడళ్ల కలయికతో పండుగ వాతావరణం వాయనాలు, పట్టు చీరలతో పరస్పర గౌరవం గ్రామస్తులను ఆకట్టుకున్న ఆచారం కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో ఆడపడుచుల మధ్య ఆత్మీయ బంధాన్ని మరింత బలపరిచేలా వినూత్న సమ్మేళనం గురువారం ఘనంగా జరిగింది. కొయ్యడి వంశానికి చెందిన మేనత్తలు, మేనకోడళ్లు ఒకే వేదికపై కలుసుకుని సంబరాలు నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కుటుంబ బంధాల ప్రాధాన్యతను చాటుతూ ఈ సమ్మేళనం గ్రామంలో ప్రత్యేక...