35 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
35 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు కిడ్స్ స్కూల్ 1989–90 బ్యాచ్ సమ్మేళనం ఘనం కాకతీయ, ఖమ్మం : పాఠశాల దశలో ఏర్పడే స్నేహబంధాలు జీవితాంతం నిలిచేవని, అవి ఎప్పటికీ విడదీయలేనివని 1989–1990 కిడ్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 35 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు అన్నారు. 1989–1990 విద్యాసంవత్సరానికి చెందిన కిడ్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువారం ఖమ్మం నగరంలోని కోణార్క్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ...