చాంబర్ ఆఫ్ కామర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
చాంబర్ ఆఫ్ కామర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని వ్యాపార సంస్థల సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 2026 సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్‌ను సంఘ అధ్యక్షుడు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, పాలకవర్గం సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మచ్చ సురేష్ మాట్లాడుతూ, సంఘ శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు ఐక్యంగా సహకరించడం అభినందనీయమని అన్నారు. నూతన సంవత్సరంలో వ్యాపారస్తులు, వినియోగదారులు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వ్యాపార అభివృద్ధి దిశగా సంఘం చేపట్టే కార్యక్రమాల్లో...