క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు కాకతీయ, చెన్నరావుపేట : క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి చెన్నరావుపేట మండలం తిమ్మరాయన్‌పాడ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిస్మస్ కరుణ, శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించే సంప్రదాయమే...