కొండగట్టులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

కొండగట్టులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కాకతీయ, కొండగట్టు : మల్యాల మండలం కొండగట్టులో గురువారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్వారా నిధులు మంజూరు కావడంలో పవన్ కళ్యాణ్ చేసిన కృషికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్ధం తిరుపతిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్...