ఐక్యతతో సోదరభావంతో జీవించాలి

ఐక్యతతో సోదరభావంతో జీవించాలి ఎమ్మెల్యే మురళీ నాయక్ కాకతీయ, నెల్లికుదురు : ప్రేమ, శాంతి, ఐక్యత, సోదరభావంతో జీవించాలనేదే క్రిస్మస్ పండుగ సారాంశమని ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్ అన్నారు. గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలోని సెయింట్ పీటర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రైస్తవ సోదరసోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ప్రజల మధ్య ఐక్యతను...