భార్య గొంతు కోసిన భర్త.. ఆత్మకూరులో దారుణం

భార్య గొంతు కోసిన భర్త ఆత్మకూరులో దారుణం అనుమానంతో హత్యాయత్నం బాధితురాలి పరిస్థితి విషమం కాకతీయ, ఆత్మకూరు : హనుమకొండ జిల్లా ఆత్మకూరులో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు గ్రామానికి చెందిన మందా రవి భార్య అనూష సమీపంలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, మనస్పర్ధలు తలెత్తడంతో తరచూ గొడవలు...