భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఏజీ

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఏజీ కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన అడ్వకేట్ జనరల్‌కు దేవాలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి మహాదాశీర్వచనం నిర్వహించి ప్రసాదాలు అందజేశామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. అనంతరం...