టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు
టేకాఫ్ అవుతున్న ఎయిర్‌పోర్టు ఏఏఐ చేతికి భూముల అప్పగింత 253 ఎకరాలు సేకరించిన రాష్ట్రం ఎకరానికి రూ.1.20 కోట్ల పరిహారం జనవరిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ మామునూరు విమానాశ్రయ పునర్నిర్మాణానికి మరో కీలక మైలురాయి దాటింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా అప్పగించింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు స్పష్టమైన దారి తెరచుకుంది. శనివారం ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బీవీ రావు బృందంతో...