డీఏల చెల్లింపు పూర్తి చేయాలి
డీఏల చెల్లింపు పూర్తి చేయాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై మానవీయ దృక్పథంతో తక్షణమే స్పందించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తండ్రి స్థానంలో నిలబడి ఉద్యోగుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి...