నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ
నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కాకతీయ, చెన్నారావుపేట : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారు చింతల తండ గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నట్టల నివారణ మందులు వాడటం వల్ల గొర్రెలు, మేకల శరీరాల్లో ఉన్న పురుగులు నశించి, పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఎదుగుదలకూ ఉపయోగపడుతుందని...