రామలింగేశ్వరాల‌యంలో కుంకుమార్చన

రామలింగేశ్వరాల‌యంలో కుంకుమార్చన కాకతీయ, నెక్కొండ : నెక్కొండ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి సహిత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బీవీఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. కార్యక్రమంలో రామలింగేశ్వర...