యూరియా అమ్మకాలు యాప్ ద్వారానే
యూరియా అమ్మకాలు యాప్ ద్వారానే కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో సోమవారం నుంచి యూరియా అమ్మకాలు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వానాకాలంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి అర్హ రైతుకు అవసరమైన యూరియాను పారదర్శకంగా అందించడం, ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడి రైతులు ఆందోళన...