మాకులలో ఘనంగా స్నాపన తిరుమంజనం!
మాకులలో ఘనంగా స్నాపన తిరుమంజనం! స్వయంభూ వెంకటేశ్వర ఆలయంలో వేడుక ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు భక్తులతో కళకళలాడిన ఆలయం కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సుప్రసిద్ధ మాకుల స్వయంభూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారం స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక అర్చకులు నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ చార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్ఛారణల...