భూపాల్‌నగర్ అటవీలో పెద్దపులి సంచారం
భూపాల్‌నగర్ అటవీలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్‌నగర్ (పందికుంట) గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ములుగు ఫారెస్ట్ అధికారి డోలి శంకర్ అటవీ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్మశాన వాటిక నుంచి మల్లంపల్లి వైపు పులి కదలికలు ఉన్నట్లు అడుగుజాడల ద్వారా నిర్ధారించారు. స్మశాన వాటిక వద్ద సిమెంట్ పోల్ విరిగిన...