జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, నిర్మాణాల అనుమతుల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక ఫైళ్లు, రికార్డులు, పలు బిల్లుల దస్త్రాలను స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల బిల్లులు, అనుమతులకు సంబంధించిన...