చెకుముకిలో అల్ఫోర్స్ జయభేరి!

చెకుముకిలో అల్ఫోర్స్ జయభేరి! కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి రాష్ట్రస్థాయి పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అసమాన ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్‌లో అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా...