గుంతలు పూడ్డి.. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్లు
గుంతలు పూడ్డి.. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్లు కాకతీయ, ఖిలావరంగల్ : కరీమాబాద్ నుంచి బట్టల బజారు వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై ఏర్పడిన భారీ గుంతలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనిపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అదే ఫ్లైఓవర్‌పై ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది....