సింగరేణి ప్రైవేటీకరణకు అవకాశమివ్వొద్దు
సింగరేణి ప్రైవేటీకరణకు అవకాశమివ్వొద్దు కార్మికుల సంక్షేమం విస్మరించొద్దు .. ప్రభుత్వంపై బాధ్యత ఉందన్న ఎమ్మెల్యే అసెంబ్లీలో కూనంనేని హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం : అనేక కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీని భవిష్యత్తులో ప్రైవేటీకరణకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. సింగరేణి కొద్ది రోజుల్లో ప్రైవేట్ పరం అయ్యే వాతావరణం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి...