మాజీ సర్పంచులకు వేధింపులు
మాజీ సర్పంచులకు వేధింపులు బిల్లులు చెల్లించకుండా ముందస్తు అరెస్టులు కాకతీయ, హుజురాబాద్: మండలంలో కొత్త సర్పంచులు ఎన్నికై పాలన సాగుతున్నా, గ్రామాభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన మాజీ సర్పంచుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో పాటు, నిరసనలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు. మాజీ సర్పంచుల బిల్లుల చెల్లింపునకు డిమాండ్ చేస్తూ, తాజా మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి...