భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. గ్రామస్థులు పులి పాదముద్రలను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే ములుగు ఫారెస్ట్ అధికారి డోలి శంకర్, అటవీ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భూపాల్ నగర్ స్మశాన వాటిక వద్ద నుంచి మల్లంపల్లి...