ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాల గుట్టలు!
ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాల గుట్టలు! పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. దుర్వాసనతో సతమతం రోగులు, సందర్శకులకు ఇబ్బందులు కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రతకు నిలయంగా ఉండాల్సిన స్థితి నుంచి పూర్తిగా విరుద్ధంగా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లోనే పడేయడంతో రోగులు, సందర్శకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆవులు, పందులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ వ్యర్థాలను చెదరగొడుతున్నాయని, దీంతో దుర్వాసన వ్యాపించి పరిస్థితి మరింత దారుణంగా మారిందని...