రౌడీషీటర్లకు పోలీస్ కౌన్సెలింగ్‌

రౌడీషీటర్లకు పోలీస్ కౌన్సెలింగ్‌ *టౌన్ ఏసీపీ రమణమూర్తి హెచ్చరిక కాకతీయ, ఖమ్మం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏసీపీ కార్యాలయంలో ఒక్కొక్కరిని పిలిపించి వారి నివాసం, జీవనోపాధి వివరాలు తెలుసుకున్నారు. నేరప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించేందుకు ఇది చివరి అవకాశం అని, మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడితే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద కేసులు...