ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కాకతీయ, వరంగల్ : గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 106 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన వినతులను పరిష్కారం నిమిత్తం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే...