వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన రామాలయం

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన రామాలయం గ‌ణ‌పురం ఆల‌యంలో గణపురంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు కాకతీయ, గణపురం : గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావచ్చన్న అంచనాతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి...