ధ్వజస్తంభ ఏర్పాటుకు విరాళం అందజేత..

ధ్వజస్తంభ ఏర్పాటుకు విరాళం అందజేత.. కాకతీయ,గీసుగొండ : శివరామ క్షేత్రంలో ధ్వజస్తంభ నిర్మాణం కోసం రూ.1,50,000/- విరాళం అందజేశారు.మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామ శివరామ క్షేత్రంలో అభివృద్ధి పనులలో భాగంగా ధ్వజస్తంభ నిర్మాణం కోసం గీసుగొండ తాజా సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ రూ.1,50,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, శివరామ క్షేత్రాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించడానికి తన వంతు సహాయ సహకారాలు...