దాడి కేసులో ఐదుగురి అరెస్టు

దాడి కేసులో ఐదుగురి అరెస్టు సీఐ మచ్చ శివకుమార్ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ లోని అశోక హోటల్‌లో వ్యాలెట్ పార్కింగ్‌లో పనిచేస్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో, డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్‌పై రాగన్న దర్వాజా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో శ్యామ్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే...