సైదాపూర్, కేశపట్నం పీహెచ్సీల తనిఖీ
సైదాపూర్, కేశపట్నం పీహెచ్సీల తనిఖీ రికార్డులు, మందుల నిల్వలపై డీఎంహెచ్ఓ సమీక్ష కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, పీఓ ఎన్సీడీ డాక్టర్ ఉమాశ్రీలతో కలిసి సైదాపూర్, కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు, అవుట్‌పేషెంట్ రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి ధృవీకరించారు. ఎన్సీడీ క్లినిక్‌లో అసంక్రామిత వ్యాధిగ్రస్తుల వివరాల నమోదు, వారికి మందులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ స్టోర్స్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన...