జయ రామ.. జయ జయ రామ..
జయ రామ.. జయ జయ రామ.. వైకుంఠ రాముడిగా అనుగ్రహించిన భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనంతో తరించిన భక్తజనం కాకతీయ, కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవోపేతంగా ఘనంగా జరిగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వైకుంఠ రాముడిగా అలంకరించబడిన స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు పరవశించి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయజయధ్వానాలతో భద్రాద్రి...