శ్రీరంగనాథుడిగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడు

శ్రీరంగనాథుడిగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడు కాకతీయ,గీసుగొండ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గీసుగొండ మండలంలోని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శ్రీరంగనాథుడిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ గర్భగుడిలో శేషపాన్పుపై శయనించిన విష్ణుమూర్తి ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వైదిక మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు...