తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద నామస్మరణతో మారుమోగిన ఏడుకొండలు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి తరువాత 1.30 గంటల నుంచి టీటీడీ వైకుంఠద్వార దర్శనాలను ప్రారంభించింది. తొలుత వీఐపీలకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు...